క్రెడిట్ కార్డును ఎలా వాడాలి దాని ఉపయోగాలు లాభాలు మరియు నష్టాలు:
సాలరీ రాగానే నేటితరం అమ్మాయిలు గానీ అబ్బాయిలు గానీ ఫోన్ కొందామని అమెజాన్ లో గాని ఫ్లిప్ కార్ట్ పండగ సీజన్ ఆఫర్లు ఏమన్నా ఉన్నాయా అని చూస్తుంటారు. ఆపిల్ ఐ ఫోన్ లేక వన్ ప్లస్ మొబైల్ కొనుక్కోవాలి అనుకుంటుంటారు.
కాకపోతే క్రెడిట్ కార్డు లేక డెబిట్ కార్డు లేకపోతే అప్పోసప్పో చేసి తీసుకుంటాం.
లాభాలు :
క్రెడిట్ కార్డు ఉపయోగం ఏందంటే బెస్ట్ ఆఫర్ డిస్కౌంట్ వెసులుబాటు ఇస్తుంది.
ఒకసారి ఈ క్రెడిట్ కార్డు ట్రాప్ లో పడ్డారు అనుకోండి అదే టైంకి EMI చెల్లించలేకపోతే దాని సైడ్ ఎఫెక్ట్ పెద్ద పద్మవ్యూహం లాంటిది.
కానీ సరిగా వాడుతుంటే దానంత సౌకర్యమైన మార్గం వేరొకటి ఉండదు.
ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉంటే వీటి మధ్యల టైం గ్యాప్ లో EMI కట్టుకోవడానికి బ్యాంకులు అవకాశం ఇస్తాయి.
ఉదాహరణకు 1 క్రెడిట్ కార్డు రెండో దానికి మధ్యలో 15 రోజులు, పది రోజుల వ్యవధి ఉంటుంది. ఈ పది రోజుల వ్యవధిలో ఈ అమౌంట్ మీరు FD లో గాని వేరే డేట్ FUND లో గాని ఉంచుకోవచ్చు దానికి మీకు తగిన ఇంట్రెస్ట్ వస్తుంది.
ఈ బ్లాక్ పోస్టులో క్రెడిట్ కార్డు లాభాలు నష్టాలు,
( ఎలిజిబిలిటీ) అర్హతలు ఏమి కావాలి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం.
క్రెడిట్ కార్డు పొందడానికి ఎలిజిబిలిటీ ఏమిటి?
1. మీరు 21 సంవత్సరములు వయస్సు కలిగి ఉండాలి
2. మీ నెలసరి జీతం కనీసం 15 నుంచి 20 వేల మధ్యలో ఉండాలి.
3. ఇన్కమ్ రిక్వైర్మెంట్, సంపాదన అనేది ప్రతి బ్యాంకు బ్యాంకు మారుతూ ఉంటుంది.
4. మీ ఐ టి ఆర్ ITR Return ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చూసి కూడా బ్యాంకు క్రెడిట్ కార్డు ఇవ్వడానికి ముందుకు వస్తుంది.
5. క్రెడిట్ స్కోర్; అనేది చాలా మందికి "నో స్కోర్," తో మొదలవుతుంది. ఇప్పటివరకు మీకు మీ పేరు పైన ఏలాంటి క్రెడిట్ స్కోర్ లేకపోయినా,
ఒక వెహికల్ లోన్ తీసుకుంటే క్రెడిట్ ప్రొఫైల్ మొదలవుతుంది. లేక మీకు కావాల్సిన ఏ కూలరో, ఫ్రిడ్జ్. బజాజ్ ఫైనాన్స్లోలోను లో తీసుకొని క్రెడిట్ ప్రొఫైల్ మొదలు పెట్టండి.
క్రెడిట్ స్కోర్ అనేది CIBIL సంస్థ ద్వారా మెయింటెన్ చేయబడుతుంది సరైన తేదీ, డ్యూ డేట్ లో మీ EMI చెల్లిస్తే క్రెడిట్ కార్డు స్కోరు పెరుగుతూ వస్తుంది. బ్యాంకులు కూడా క్రెడిట్ కార్డు ఇవ్వడానికి ముందుకు వస్తాయి.
CRED యాప్ ద్వారా మీరు పేమెంట్ చేస్తే మీరు చేసిన EMI లకు రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది.
సమస్యలు:
మరి క్రెడిట్ కార్డ్ వాడితే సమస్యలు ఏ విధంగా వస్తాయి ?
1.సమయానికి EMI కట్టక పోవడం వల్ల బ్యాంకులు మీకు పెనాల్టీలు వేస్తారు .
ఉదాహరణకు Rs.1200 EMI కి
Rs.1600 వరకు. Bank charges, late fee అని penalty వేస్తారు
ఇది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే మీరు due date మర్చిపోవడం గాని , మీరు అందుబాటులో లేకపోవడం గానీ, మీరు ఉన్న ప్రాంతంలో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం వల్ల గాని, mistake జరుగుతూ ఉంటుంది. ఇలాంటి అనివార్య కారణాలుకు బ్యాంకులను రిక్వెస్ట్ చేస్తే వాళ్లు తిరిగి మీకు penalty refund చేస్తారు. రివర్టు చేస్తారు.
2 అదుపుతప్పి వాడడం వల్ల గాని ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
మీరు జాగ్రత్తగా లాభదాయకంగా వాడుకుంటే ఈ సౌకర్యాన్ని మించిన వేరొక సౌకర్యం ఉండదు.
పరిష్కారం:
మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అంటే?
మీకు ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులు వాటిని వాటి డ్యూ డేట్ గుర్తు పెట్టుకునే అవసరం లేకుండా వాటిని CRED యాప్ లో సేవ్ చేసుకోండి.
Banks క్రెడిట్ కార్డులు స్పెండ్ చేస్తే మీకు రివార్డ్ పాయింట్లు ఇస్తే, CREd యాప్ అనేది సకాలంలో పేమెంట్స్ చేస్తే credit పాయింట్స్ ఇస్తుంది.
CRED యాప్ వాడడానికి మీకు 750 క్రెడిట్ స్కోర్ ఉండాల్సి ఉంటుంది. మరియు బ్యాంకు లో ఆటో డిబేట్ ఫెసిలిటీ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఆటో డెబిట్ అనగా మీ due date ప్రకారం అదే రోజు బ్యాంకు నుండి మీ అమౌంట్ అన్నది EMI మీ అకౌంట్ నుండి కట్ అవుతుంది ఆటోమేటిక్ గా.
చివరికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే క్రెడిట్ కార్డుల సరిగా వాడడం వల్ల మంచి లాభాలు ఉన్నాయి మరియు అదుపుతప్పి వాడడం వల్ల అనర్థాలకు దారితీసే ఫైనాన్స్ డిసిప్లేన్ లేక బతుకు బండి గాడి తప్పుతుంది.
