రహస్యంగా Britney Spears పెళ్లి.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మాజీ భర్త..


 పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ (Britney Spears) ప్రియుడైన సామ్ అస్ఘరి(Sam Asghari)ని రహస్యంగా మూడో పెళ్లి చేసుకుంది. లాస్ ఏంజెల్స్‌లో గురువారం ఘనంగా ఈ వివాహం జరిగింది. అయితే, ఈ వేడుకను అడ్డుకునేందుకు  బ్రిట్నీ స్పియర్స్‌ మాజీ భర్త జేసన్ అలెగ్జాండర్ ప్రయత్నించాడు. బ్రిట్నీ స్పియర్స్ ఎక్కడ..? అంటూ పెళ్లి వేదిక మీదకు తోసుకుంటూ రాగా పోలీసులు అరెస్టు చేశారు. బ్రిట్నీ స్పియర్స్‌కు చిన్ననాటి స్నేహితుడైన జేసన్ అలెగ్జాండర్‌ (Jason Alexander) తో 2004లో పెళ్లి అయింది. కానీ, ఈ జంట కేవలం 55గంటలు మాత్రమే కలసి ఉన్నారు. బ్రిట్నీ అనంతరం కెవిన్‌ ఫెడర్‌లైన్‌ను రెండో వివాహాం చేసుకుంది. ఈ జంటకు సీన్‌, జైడెన్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కెవిన్‌కు 2007లో ఆమె విడాకులిచ్చింది. 

Post a Comment

Previous Post Next Post